అచ్చు లఖీంపూర్ ఖేరీ లాంటి సంఘటనే ఒడిశాలో జరిగింది. అధికార బీజూ జనతాదళ్ సస్పెండెడ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జాదవ్ ఈ పనికి ఒడిగడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గుమిగూడిన ప్రజలను తన కారుతో తొక్కేశారు. ఈ దుర్ఘటనలో 23 మంది గాయాలపాలయ్యారు. అలాగే డ్యూటీలో ఉన్న 7 గురు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఈ ఏడుగురు పోలీసుల్లో మహిళా పోలీసులు కూడా వున్నారు. గాయాలపాలైన వీరందర్నీ దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
వాహనాన్ని తుక్కు తుక్కు చేసి.. ఎమ్మెల్యేను కొట్టిన ప్రజలు
ప్రజలను తన కారుతో తొక్కేయడంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు. ఆయన వాహనాన్ని తుక్కు తుక్కు చేశారు. అంతేకాకుండా ఆయనపై దాడి కూడా చేశారు. దీంతో ఎమ్మెల్యే కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యేను, గాయపడ్డవారందర్నీ ఒకే ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
ఖుర్దాలోని బన్పూర్ బ్లాక్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందు కోసం వివిధ పార్టీల నేతలు, ప్రజలు 600 మంది సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. చేరుకునే సమయంలోనే ఆయన కారును ప్రజలపైకి ఎక్కించారు. ఈ ఘటనలో 23 మంది గాయాలపాలయ్యారు. ఏడుగురు పోలీసులు గాయాలపాలయ్యారు.