ఊబకాయంతో రొమ్ము క్యాన్సర్
సర్వరోగాలకు ఊబకాయమే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిమితికి మించిన బరువు జీవక్రియలపై ప్రభావం చూపడంతోపాటు క్యాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుందని జాతీయ పోషకాహార సంస్థ, అన్నామలై వర్సిటీ, ఆర్ కేశవన్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
- తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): సర్వరోగాలకు ఊబకాయమే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిమితికి మించిన బరువు జీవక్రియలపై ప్రభావం చూపడంతోపాటు క్యాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుందని జాతీయ పోషకాహార సంస్థ, అన్నామలై వర్సిటీ, ఆర్ కేశవన్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఊబకాయం, రొమ్ము క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు సన్నగా, అధిక బరువుతో ఉన్న ఎలుకలను ఎంచుకున్నారు. క్యాన్సర్ కారకమైన డీఎంబీఏను వీటికి అందించగా సన్నటి ఎలుకల్లో 211 రోజుల రొమ్ము క్యాన్సర్ కణతి అభివృద్ధి చెందితే, అధిక బరువుతో ఉన్న ఎలుకల్లో 119 రోజుల్లోనే దానిని గుర్తించారు. దీనిని బట్టి ఊబకాయానికి, రొమ్ము క్యాన్సర్‌కు మధ్య సంబంధం ఉందని నిరూపితమైంది. ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని అంచనా వేయడంలో ఈ జీవకణ అధ్యయనం కీలకంగా మారినట్టు పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

