CUET-PG : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-పీజీ (CUET-PG)’ ఫలితాలు ఈ రాత్రికి విడుదల కానున్నాయి. ఈ రాత్రికే ఫలితాలను విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)’ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ వెల్లడించారు.
‘ఈ రాత్రికే CUET-PG ఫలితాలను విడుదల చేసేందుకు NTA కసరత్తు చేస్తున్నది. ఈ పరీక్షలో సాధించే మార్కుల ఆధారంగానే విద్యార్థులకు దేశంలోని వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. CUET-PG పరీక్ష రాసిన విద్యార్థులందరికి గుడ్ లక్ చెబుతున్నా’ అని UGC చైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పేర్కొన్నారు.