న్యూఢిల్లీ: వ్యక్తులు టీకా తీసుకున్నారా లేదా అన్నది కొవిన్ ద్వారా తెలుసుకోవచ్చు. CoWIN డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ‘నో యువర్ వ్యాక్సినేషన్ స్టాటస్’ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. దీంతో సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్ టీకా స్థితిని దీని ద్వారా తనిఖీ చేయవచ్చని పేర్కొంది. వెరిఫై చేసే అధీకృత హక్కులు పొందిన వారు పౌరుడి టీకా స్థితిని తెలుసుకోవడంతోపాటు టీకా వివరాలను ధృవీకరించడానికి, పొందడానికి ఇది సహాయపడుతుందని వెల్లడించింది.
అలాగే పౌరుడు అభ్యర్థించిన సేవలను సులభతరం చేయడం కోసం సర్వీస్ ప్రొవైడర్ (ట్రావెల్ ఏజెన్సీలు, కార్యాలయాలు, యజమానులు, ఎంటర్టైన్మెంట్ ఏజెన్సీలు మొదలైన ప్రైవేట్ సంస్థలు లేదా IRCTC, ప్రభుత్వ కార్యాలయాలు మొదలైన ప్రభుత్వ సంస్థలు) ఈ సేవను ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
కాగా, పూర్తిగా, పాక్షికంగా టీకాలు పొందిన బ్యాడ్జ్‌ని CoWIN (cowin.gov.in) నుండి డౌన్లోడ్ చేసుకోవడంతోపాటు అన్ని సామాజిక ప్లాట్‌ఫారమ్‌లలో స్నేహితులకు షేర్ చేయవచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ CEO డాక్టర్ రామ్ సేవక్ శర్మ తెలిపారు. ‘#FightCovidని అనుసరించమని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రోత్సహించండి” అని ట్వీట్ చేశారు.
Now download the fully / partially vaccinated badge from CoWIN (https://t.co/Bt1DbmK6XH) & share it with your friends on all your social platforms! Encourage your family and friends to follow you and #FightCovid.
— Dr. RS Sharma (@rssharma3) November 20, 2021
My Vaccination Status – https://t.co/qpDd44vh5I#PublicHealth pic.twitter.com/q0uOk7ykKC