బెంగళూరు: మోటార్‌సైకిల్ రోడ్డు ప్రమాదానికి గురైనపుడు, ఆ ప్రమాదంలో ఆ బైక్‌ను నడిపిన వ్యక్తి తప్పు లేనపుడు, ఆ వ్యక్తి హెల్మెట్ ధరించలేదనే కారణాన్ని చూపుతూ, బీమా కంపెనీలు బీమా క్లెయిము సొమ్మును తగ్గించరాదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.
హెల్మెట్ ధరించిన వ్యక్తి సురక్షితంగా ఉంటారనే విషయం నిజమే అయినప్పటికీ, బాధితుడి నిర్లక్ష్యం ఆ ప్రమాదం జరగడానికి కారణమైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించడంలో విఫలమయ్యారనే వాదన వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించనందున బాధితునికి చెల్లించవలసిన నష్టపరిహారాన్ని తగ్గించడానికి ఈ వాదన ఉపయోగపడుతుందని తెలిపింది. 2016లో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో గాయపడిన ఖాన్ అనే వ్యక్తి కేసులో ఈ తీర్పు చెప్పింది.
ఖాన్ హెల్మెట్ ధరించలేదనే కారణాన్ని చూపి ఆయనకు పరిహారం తగ్గిస్తూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ 2020లో ఆదేశించింది. దీనిని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు.