శనివారం 06 మార్చి 2021
National - Jan 25, 2021 , 00:15:44

నిక్క‌ర్‌వాలాలు త‌మిళ భ‌విత‌వ్యం నిర్దేశ‌కులు కారు: రాహుల్‌

నిక్క‌ర్‌వాలాలు త‌మిళ భ‌విత‌వ్యం నిర్దేశ‌కులు కారు: రాహుల్‌

చెన్నై‌: త‌మిళ‌నాడు రాష్ట్ర భ‌విత‌వ్యాన్ని నిర్దేశించేది నాగ్‌పూర్ నిక్క‌ర్ వాలాలు కాద‌ని, త‌మిళ యువ‌త మాత్ర‌మేన‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. త్వ‌ర‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఆదివారం ఈరోడ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ధ‌ర్మ‌పురంలో జ‌రిగిన స‌భ‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ఆర్ఎస్ఎస్‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేశారు. 

నాగ్‌పూర్ నుంచి వ‌చ్చే నిక్క‌ర్ వాలాలు.. ఎప్ప‌టికీ రాష్ట్ర భ‌విత‌వ్యాన్ని నిర్దేశించ‌లేరు. వారు ఎన్ని ప‌రేడ్‌లు నిర్వ‌హించార‌న్న‌ది స‌మ‌స్య కాద‌న్నారు. త‌మిళ‌నాడు యువ‌కులు మాత్ర‌మే త‌మ రాష్ట్ర భ‌విత‌వ్యాన్ని ఖ‌రారు చేస్తార‌న్నారు. దేశ పునాదుల‌ను ధ్వంసం చేయ‌డానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని బెదిరింపుల‌తో నియంత్రించొచ్చుగానీ, ప్ర‌జ‌ల‌ను కూడా అలా చేయొచ్చున‌ని భావించొచ్చున‌న్నారు. కానీ త‌మిళ ప్ర‌జ‌లే త‌మ భ‌విత‌వ్యాన్ని నిర్దేశించుకుంటార‌న్న సంగ‌తి ఆయ‌న‌కు అర్థం కాద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ త‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో కే కామ‌రాజ్‌, ఎంజీ రామ‌చంద్ర‌న్‌, ఎం క‌రుణానిధి, జ‌య‌ల‌లిత‌ల‌కు నివాళుల‌ర్పించారు. త‌మిళ‌నాడులో కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షం డీఎంకే పేరును ఆయ‌న ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది. అయితే త‌మిళ‌నాడు పీసీసీ అధ్య‌క్షుడు కేఎస్ అళ‌గిరి మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల నాటికి బీజేపీకి వ్య‌తిరేకంగా దీర్ఘ‌కాల ద్ర‌విడ కూట‌మిని ముందుకు తీసుకొస్తామ‌ని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo