woman harassed by Police | కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళ.. కోరిక తీర్చాలంటూ వేధించిన యూపీ పోలీసులు
woman harassed by Police | కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది.
లక్నో: కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరకు రూ.1000 బలవంతంగా పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 13న నోయిడాకు చెందిన 22 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉపవన్ పార్క్‌ను సందర్శించింది.
పోలీస్ రెస్పాన్స్ వాహనంలో విధులు నిర్వహించే ముగ్గురు పోలీసులు ఆ జంటను వేధించారు. కాబోయే భర్త చెంపపై కొట్టారు. కోరిక తీర్చాలని ఆ మహిళను పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్ బలవంతం చేశాడు. అలాగే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ జంటను విడిచిపెట్టేందుకు ఒక పోలీస్ పది వేలు మరో పోలీస్ ఏకంగా రూ.5.5 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ జంటను సుమారు మూడు గంటలపాటు వేధించారు. చివరకు ఆ మహిళ మొబైల్లోని పేటీఎం యాప్ నుంచి రూ.1,000 ట్రాన్స్పర్ చేసుకుని విడిచిపెట్టారు.
అంతటితో ఆగని ఆ పోలీసులు ఆ మహిళను ఆ తర్వాత కూడా వేధించారు. సెప్టెంబర్ 19న రాకేష్ కుమార్ ఆమెకు ఫోన్ చేశాడు. తన కోరిక తీర్చాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె ఆ కాల్‌ను రికార్డ్ చేసింది. సెప్టెంబర్ 22న ఆ ముగ్గురు ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో పోలీసుల వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. అత్యవసర నంబర్‌కు కాల్ చేసింది.
కాగా, మహిళ నుంచి విషయం తెలుసుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ఆమెను లైంగికంగా వేధించిన పోలీసులపై పలు సెక్షన్ల కింద సెప్టెంబర్ 28న కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులైన కానిస్టేబుల్ రాకేష్ కుమార్, హోంగార్డు దిగంబర్ కుమార్‌తోపాటు మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. పోలీస్ కానిస్టేబుల్ రాకేష్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. హోంగార్డ్‌పై చర్యల కోసం ఆ విభాగానికి లేఖ రాసినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- harassed
- park
- Police
- UP's Ghaziabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

