(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఐటీ నిపుణులు లైఫ్టువేక్ (Life2vec) అనే అద్భుతమైన ఏఐ అప్లికేషన్ ఆవిష్కరించారు! ఇదో డెత్ ప్రిడెక్టర్. అంటే వ్యక్తి మరణం గురించి జోస్యం చెబుతుంది.
ఆ వ్యక్తి చరిత్ర, జీవన విధానం, ఆరోగ్య సమస్యలు, జీవితంలో జరిగిన సంఘటనలను పరిశీలించి, వాటి ఆధారంగా అతను ఎప్పుడు మరణిస్తాడో కచ్చితంగా చెబుతున్నదట. యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు ఈ ఏఐ ఆధారిత డెత్ ప్రిడెక్టర్ను అభివృద్ధి చేశారు. ఇది వ్యక్తుల జీవిత కాలాన్ని అంచనా వేయడంలో 78 శాతం కచ్చితత్వంగా పనిచేస్తుంది.