Health tips | భోజనానికి ముందు, తర్వాత ఆ రెండూ అస్సలు తీసుకోవద్దు..!
Health tips | మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి లేకపోతే ఎంతో మందికి పొద్దు గడవదు. కానీ, వీటిని మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది.
- భారత వైద్య పరిశోధనా మండలి హెచ్చరిక
- మితంగానే వాటిని సేవించాలని సూచన
న్యూఢిల్లీ, మే 14: మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి లేకపోతే ఎంతో మందికి పొద్దు గడవదు. కానీ, వీటిని మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్పష్టం చేసింది. దేశంలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించేందుకు ఐసీఎంఆర్ ఇటీవల జాతీయ పౌష్ఠికాహార సంస్థ (ఎన్ఐఎన్)తో కలిసి 17 సరికొత్త ఆహార మార్గదర్శకాలను జారీచేసింది. టీ, కాఫీని అధికంగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరించారు.
వీటిలో ఉండే కెఫీన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి టీ, కాఫీపై శారీరకంగా ఆధారపడే తత్వాన్ని పెంపొందిస్తుందని ఐసీఎంఆర్ పరిశోధకులు వివరించారు. మనం సేవించే ప్రతి కప్పు (150 మిల్లీలీటర్ల) బ్రూవ్డ్ కాఫీలో 80 నుంచి 120, ఇన్స్టంట్ కాఫీలో 50-65, టీలో 30-65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుందని పేర్కొంటూ.. రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫీన్ను మాత్రమే తీసుకోవాలని సూచించారు. భోజనం చేయడానికి గంట ముందు, భోజనం చేసిన తర్వాత టీ, కాఫీ తాగకూడదని, లేకపోతే వాటిలోని టానిన్లు మన దేహంలో ఇనుము శోషణ శక్తిని తగ్గిస్తాయని తెలిపారు.
దీంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత లాంటి సమస్యలకు దారితీస్తుందన్నారు. కాఫీని ఎక్కువగా సేవిస్తే అధిక రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అయితే, పాలు లేకుండా టీ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతోపాటు గుండె జబ్బులు, ఉదర క్యాన్సర్ ముప్పు తగ్గడం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

