Sonia-Azad | నాయకత్వంపై చర్చ రాలేదు..సోనియాతో భేటీ తర్వాత ఆజాద్!
Sonia-Azad | సోనియాగాంధీతో భేటీలో నాయకత్వం అంశమే చర్చకు రాలేదని అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్ చెప్పారు.
Sonia-Azad | కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు అంశంపై తమ మధ్య చర్చకు రాలేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలోనూ ఏ ఒక్కరూ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని తప్పుకోవాలని కోరలేదని గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో జీ-23 గ్రూప్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ ముగిసింది. సోనియాతో భేటీ తర్వాత ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఎలా సిద్ధం కావాలన్న అంశంపై చర్చించామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంచి సమావేశం జరిగిందని ఆజాద్ చెప్పారు. సోనియాతో భేటీ నిరంతరం జరిగే భేటీ మాత్రమేనన్నారు. జీ-23 నేతలు ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత ఆజాద్ నివాసంలో బుధ, గురువారాల్లో వరుసగా భేటీ అయ్యారు. సోనియా గాంధీ అధికార నివాసమైన 10-జన్‌పథ్‌లో ఆజాద్ సమావేశమై ఆమెకు వాస్తవ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీలో సమూల మార్పులు తేవాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని జీ-23 నేతలు డిమాండ్ చేశారు.
కొంత కాలంగా పార్టీ పరిస్థితిపై అసంతృప్తితో ఉన్న ఆజాద్ సారధ్యంలో జీ-23 నేతలు తరుచుగా సమావేశమవుతున్నారు. అందరినీ కలుపుకోవాలని సోనియాగాంధీని కోరినట్లు సమాచారం. పార్టీ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకోవాలని సీనియర్ నేత కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో దుమారం చెలరేగింది. ఈ భేటీతో పార్టీలో అసంతృప్తి ఉందన్న వార్తలను కొట్టి పారేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

