మహారాష్ట్రలో కఠిన లాక్డౌన్ అవసరం లేదు: ఉద్ధవ్ ఠాక్రే

ముంబై: మహారాష్ట్రలో కఠిన లాక్డౌన్ అవసరం లేదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తున్నారని, రాష్ట్రంలో కరోనా పరిస్థితి మెరుగుపడుతున్నదని చెప్పారు. ప్రజలనుద్దేశించి శుక్రవారం ఆయన టీవీలో ప్రసంగించారు. ఆంక్షలు, లాక్డౌన్ వల్లనే కరోనాను నియంత్రించగలమని ఉద్ధవ్ అన్నారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పది లక్షలకు చేరుతుందని అంచనా వేశామని, అయితే ఇది ఏడు లక్షలుగా ఉన్నదని తెలిపారు. వైద్య సౌకర్యాలను పెంచుతున్నామని, అయితే వైద్య నిఫుణుల కొరత ఉన్నదని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో వైద్యపరమైన మౌళిక సదుపాయాలను పెంచామని, అయితే వైద్యులు, నర్సులను ఎక్కడి నుంచి తీసుకువస్తామని ఉద్ధవ్ ప్రశ్నించారు. ఆక్సిజన్ కొరత చాలా ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుండగా వినియోగం 1700 మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం సమకూర్చుతున్నదని వివరించారు. కరోనా సెకండ్, థర్డ్ వేవ్‌లతో ప్రపంచమంతా సతమమవుతున్నదని, మహారాష్ట్రలో పరిస్థితి దీనికి భిన్నం కాదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

