కొవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్ ఔట్.. సీటీ స్కాన్లూ వద్దు!

న్యూఢిల్లీ: కరోనా చికిత్సలో పలు కీలకమైన మార్పులు చేసింది కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్). లక్షణాలు లేని వాళ్లకు అసలు ఏ మందులూ వద్దని స్పష్టం చేసింది. స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు యాంటీపైరెటిక్, యాంటీట్యూసివ్ మందులు మాత్రమే వాడాలని చెప్పింది. ఇన్నాళ్లూ లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లకు కొవిడ్ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింక్, మల్టీ విటమిన్ల వంటి ట్యాబ్లెట్లు అవసరం లేదని తేల్చి చెప్పింది. జ్వరం కోసం యాంటీపైరెటిక్, జలుబు కోసం యాంటీట్యూసివ్ మందులు మాత్రం వాడితే చాలని తెలిపింది.
అవనసరంగా పేషెంట్లకు సీటీ స్కాన్లు చేయించొద్దని కూడా డాక్టర్లకు సూచించింది. కొవిడ్‌ను అడ్డుకోవడానికి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు కనిపిస్తే టెలీకన్సల్టేషన్లు జరపాలని, పోషకాహారం తీసుకోవాలని సూచించింది. పేషెంట్లు, కుటుంబ సభ్యులు ఫోన్లో, వీడియో కాల్స్‌లో మాట్లాడుకుంటూ ఉండాలని, సానుకూల విషయాలు చర్చించాలని చెప్పింది. లక్షణాలు లేని వాళ్లకు అసలు ఎలాంటి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లయితే మాత్రం తాము వాడుతున్న మందులను కొనసాగించాలని సూచించింది.
స్వల్ప లక్షణాలు ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ సాచురేషన్ వంటివి చెక్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. దగ్గు ఉంటే ఐదు రోజుల పాటు ఆవిరి కోసం బుడెసొనైడ్ 800 ఎంసీజీ డోసు రోజుకు రెండుసార్లు వాడాలని చెప్పింది. ఇక ఎలాంటి చికిత్స, మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

