Arvind Kejriwal | వారికి ఓ విజన్ లేదు.. సీఎం అభ్యర్థి లేరు.. బీజేపీ విమర్శలకు కేజ్రీవాల్ కౌంటర్
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అరోప్ పత్ర పేరిట ఆప్ ప్రభుత్వంపై బీజేపీ రెండు రోజుల క్రితం తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వమని బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) తాజాగా స్పందించారు. ఈ మేరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదని.. తనను ఎలా వేధించాలో మాత్రమే తెలుసునని వ్యాఖ్యానించారు. ‘ఈ ఎన్నికల కోసం బీజేపీకి ఎలాంటి అజెండా లేదు. ఇంత వరకూ సీఎం అభ్యర్థి కూడా లేరు. వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
కాగా, ఆప్ ప్రభుత్వంపై అరోప్ పత్ర పేరుతో బీజేపీ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ‘ఢిల్లీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అసమర్థ ప్రభుత్వం. అందరికీ ఉచిత నీరు అని చెప్పారు. నేడు ప్రజలు ట్యాంకర్లకు వేలకు వేలు చెల్లిస్తున్నారు. ఢిల్లీని కాలుష్య రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. చివరికి వాళ్ల మంత్రులే కటకటాల పాలయ్యారు’ అని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
‘కేజ్రీవాల్జీ.. మీరు తరచుగా నంబర్ 1 అని చెబుతుంటారు. మీరు ఎందులో నంబర్ 1..? దేశంలోనే అత్యంత ఖరీదైన నీటిని మీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ నంబర్ 1. దేశంలోనే అత్యంత అవినీతిపరులైన మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు’ అంటూ కేజ్రీవాల్‌పై అనురాగ్ ఠాకూర్ విమర్శలు గుప్పించారు.
Also Read..
CV Anand | సహనం కోల్పోయా.. క్షమించండి: సీవీ ఆనంద్ పోస్ట్
Srinagar | చలి గుప్పిట్లో అందాల కశ్మీర్.. భారీగా పతనమైన ఉష్ణోగ్రతలు.. గడ్డకట్టిన దాల్ సరస్సు
UP Encounter | యూపీలో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

