లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అంతా నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వాలు వేలు పెట్టుకుంటేనే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారు.
సీఎం నితీశ్ కుమార్ శనివారం బిహార్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేశారు. ”ఆ (లౌడ్ స్పీకర్ల) నాన్సెన్స్ గురించి మాట్లాడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మత వ్యవహారాల్లో మా ప్రభుత్వం వేలు పెట్టదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొందరు గొడవ చేయడమే తమ పనిగా పెట్టుకుంటారు. వారిని అలాగే ఉండనివ్వండి” అంటూ సీఎం నితీశ్ తన మిత్రపక్షమైన బీజేపీపై విరుచుకుపడ్డారు.