Nitin Gadkari | డ్రైవర్‌లెస్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోం: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
Nitin Gadkari | దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం (IIM) నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రోడ్డు భద్రతా సమస్యలపై మాట్లాడారు.
న్యూఢిల్లీ: దేశంలోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెన్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం (IIM) నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రోడ్డు భద్రతా సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రైవర్‌లెస్ కార్లను దేశంలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు.
అదేవిధంగా కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు, రోడ్లపై బ్లాక్ స్పాట్లను తొలగింపు లాంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
హైడ్రోజన్‌ను భవిష్యత్తు ఇంధనంగా నితిన్ గడ్కరీ అభివర్ణించారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14లో రూ.51 వేల కోట్లు ఉండగా.. 2022-23లో రూ.2.40 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2013-14లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.31,130 కోట్లు కాగా.. 2023-24 నాటికి ఇది రూ.2,70,435 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

