NDA Govt | పీఎం ప్యాకేజీ.. బడ్జెట్లో రూటు మార్చిన ఎన్డీయే సర్కారు
లోక్‌సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
- నిరుద్యోగిత రేటు పెరుగుతున్న వేళ కేంద్రం నుంచి మూడు కీలక స్కీమ్‌లు
- ఉద్యోగులతో పాటు యాజమాన్యాలకూ ఊరటనిచ్చేలా పలు ఉద్దీపన చర్యలు
- ప్యాకేజీ కింద మరికొన్ని స్కీమ్‌లు కూడా..
NDA Govt | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ మేరకు బడ్జెట్లో ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’ పేరిట మూడు కీలక పథకాలతో పాటు మరికొన్ని స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఉద్యోగులతో పాటు యాజమాన్యాలకూ ఉపశమనాన్నిచ్చే ప్రకటనలు చేసింది.
స్కీమ్-1: కొత్త ఉద్యోగులకు నెల వేతనం
సంఘటిత రంగంలో తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఒక నెల వేతనాన్ని అందించనున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద గరిష్ఠంగా రూ.15 వేల వరకు మూడు వాయిదాల్లో దీన్ని చెల్లించనున్నారు. 2.1 కోట్ల మందికి లబ్ధి చేకూర్చవచ్చని భావిస్తున్నారు.
స్కీమ్-2: తయారీ రంగంలో కొలువులు
తయారీ రంగంలో అదనపు ఉపాధి కల్పనే లక్ష్యంగా రెండో పథకాన్ని తీసుకొచ్చారు. తొలిసారి ఉద్యోగాల్లో చేరినవారితో పాటు అదనపు ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు ఉద్యోగుల భవిష్యనిధి కంట్రిబ్యూషన్ (ఈపీఎఫ్‌వో) ద్వారా నాలుగేండ్ల పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. గరిష్ఠంగా రూ.లక్ష వేతనం ఉన్నవారికి దీన్ని వర్తింపజేస్తామన్నారు. దాదాపు 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
స్కీమ్-3: యాజమాన్యాలకూ లబ్ధి
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి యాజమాన్యాలకు రెండేండ్ల పాటు రూ.3,000 వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్‌ను కేంద్రం రీయంబర్స్ చేస్తుంది. ఈ పథకం వల్ల 50 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని భావిస్తున్నారు.
టాప్-500 కంపెనీల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్
పీఎం ప్యాకేజీలోని మూడు పథకాలతో పాటు యువతలో నైపుణ్యాల మెరుగుకు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి కేంద్రం మరికొన్ని ప్రత్యేక పథకాలను, కార్యక్రమాలను ప్రతిపాదించింది. మోడల్ స్కిల్ లోన్ కింద రూ.7.5 లక్షల వరకు రుణాలకు ప్రభుత్వ ప్రాయోజిత ఫండ్ ద్వారా పూచీకత్తు ఇస్తామని కేంద్రం తెలిపింది. దీని వల్ల ఏటా 25,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సహకారంతో ఐదేండ్ల వ్యవధిలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణనివ్వనున్నట్టు వెల్లడించింది.
రానున్న ఐదేండ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటిమంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించింది. అలాగే, ఇంటర్న్‌షిప్ భత్యం కింద నెలకు రూ. 5 వేల చొప్పున అందజేయనున్నట్టు వివరించింది. ఒక్కదఫాలో మరో రూ. 6 వేలు ఇవ్వనున్నట్టు వివరించింది. పరిశ్రమల సహకారంతో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. అలాగే మహిళల కోసం పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను చేపడతామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

