NIA Raids: ఆరు చోట్ల ఎన్ఐఏ సోదాలు.. రూ.2.98 లక్షలు స్వాధీనం
NIA raids: చత్తీస్‌ఘడ్‌లో ఎన్ఐఏ అధికారులు 2.98 లక్షల నగదు సీజ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ పార్టీపై నక్సల్స్ ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఆ కేసుతో లింకున్న ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేసింది.
న్యూఢిల్లీ: చత్తీస్‌ఘడ్‌లో ఎన్ఐఏ(NIA Raids) అధికారులు 2.98 లక్షల నగదు సీజ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ పార్టీపై నక్సల్స్ ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఆ కేసుతో లింకున్న ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు చేసింది. ఆ తనిఖీల్లో నగదుతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గరియాబంద్ జిల్లాలోని బడేగోబ్రా గ్రామంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఆరుగురు అనుమానితుల ఇండ్లల్లో తనిఖీలు చేశారు. 2.98 లక్షలతో పాటు అనేక మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మెయిన్‌పుర్-నౌపద డివిజన్‌కు చెందిన నిషేధిత నక్సల్ గ్యాంగ్‌తో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నవంబర్ 2023లో జరిగిన దాడిలో ఇండో టిబెటియన్ బెటాలియన్ పోలీసుకు చెందిన 615 బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ గాయపడ్డారు. ఫిబ్రవరి 2024లో కేసును దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ.. దాడికి పాల్పడిన నక్సల్ క్యాడర్లను గుర్తించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

