NExT MOCK TEST| నెక్స్ట్ మాక్ టెస్ట్ రద్దు!.. ఫీజు రిఫండ్
న్యూఢిల్లీ: 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులకు నెక్స్ట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్.. తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 28న ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది.
NExT MOCK TEST| న్యూఢిల్లీ: 2019 బ్యాచ్ ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులకు నెక్స్ట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్.. తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 28న ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్ఎంసీ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ర్టేషన్ బోర్డు సభ్యుడు డాక్టర్ యోగేంద్ర మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫీజును రీఫండ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే పరీక్ష రద్దుపై ఎన్ఎంసీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
కేంద్ర వైద్య శాఖ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నెక్ట్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్ఎంసీ ఈ నెల 13న ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మాక్‌టెస్ట్‌ను కూడా రద్దు చేశారు. దీనిపై ఎన్ఎంసీ నుంచి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. నెక్స్ట్ మార్గదర్శకాలను ఎన్ఎంసీ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు రెండు దశల్లో (నెక్స్ట్ స్టెప్1, నెక్ట్స్ స్టెప్ 2) నిర్వహిస్తారు. పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు, దేశంలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అలాగే విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు భారత్‌లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఈ పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

