డిసెంబర్ 1 నుంచి కొత్త హెచ్చరిక ముద్రణ
న్యూఢిల్లీ, జూలై 22: పొగాకు ఉత్పత్తులపై ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే సిగరెటు ప్యాకెట్లు, బీడీ కట్టలు, జర్దా, ఖైనీ, ఇతర పొగాకు ఉత్పత్తులపై ఉన్న హెచ్చరిక ప్రకటన, హెచ్చరిక బొమ్మను కేంద్రం మార్చనున్నది.
పొగాకు ఉత్పత్తులపై కొత్త ఫొటో, అకాలమరణం హెచ్చరిక ఉండాలని పేర్కొంటూ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘పొగాకు వినియోగం అంటే అకాలమరణం’ అని స్పష్టంగా కనిపించేలా పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ ఉండాలని సూచించింది. ప్యాకెట్లపై ముద్రించే హెచ్చరిక బొమ్మ సైజును సైతం పెంచనున్నది. ఈ సంవత్సరం డిసెంబర్ 1నుంచి కొత్త హెచ్చరిక అమల్లోకి రానున్నది.