ముంబై ఉగ్ర దాడిలో అమరుడైన పోలీస్ అధికారికి అరుదైన గౌరవం..

ముంబై: మహారాష్ట్రలో రెండు కొత్త సాలీడు జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో ఒక సాలీడు జాతికి 26/11 ముంబై ఉగ్రవాద దాడిలో మరణించిన ముంబై పోలీస్ అధికారి ఏఎస్ఐ తుకారాం ఓంబుల్ పేరుపెట్టారు. ఆయన గౌరవార్థం ఎగిరే కొత్త సాలీడు జాతుల్లో ఒక దానికి ‘ఐసియస్ తుకారామి’గా నామకరణం చేసి ఆ మేరకు పరిశోధనా పత్రంలో పేర్కొన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్లో తెలిపారు.
So much nature yet to explore & a good way to pay respect to martyr. A new species of jumping spider is documented Icius tukarami from Maharashtra. Named after the martyr Tukaram by researchers. @Dhruv_spidy pic.twitter.com/VQEbB9xbyE
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 28, 2021
జంపింగ్ స్పైడర్ రెండవ జాతికి ఫింటెల్లా చోల్కీ అని పేరు పెట్టినట్లు పర్వీన్ వెల్లడించారు. ఈ జాతిని ముంబైలోని థానే, ఆరే మిల్క్ కాలనీలో కనుగొన్నట్లు వెల్లడించారు.
Second new species of jumping spider is Phintella cholkei. This species is distributed in Thane and Aarey Milk Colony in Mumbai. Great find & documentation. pic.twitter.com/LJqGB9fkhq
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 28, 2021
కాగా, 2009లో అశోక్ చక్ర పురస్కారంతో గౌరవం పొందిన ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన పోలీస్ అధికారి తుకారాం ఓంబుల్ను నెటిజన్లు ఈ సందర్భంగా స్మరించుకుని నివాళి అర్పించారు. ఈ కొత్త జాతి సాలీడ్లు ప్రమాదకరమైనవా అంటూ కొందరు ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

