Floor Test | నేడు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్న హర్యానా నూతన సీఎం సైనీ
Floor Test | హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ (Nayab Saini) ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనీ అసెంబ్లీలో తన బలాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Floor Test | సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana Chief Minister) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ ఊహించని విధంగా రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ (Nayab Saini)ని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా సైనీతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ నేపథ్యలో సైనీ నేడు బలపరీక్షను (Floor Test) ఎదుర్కోబోతున్నారు.
తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నూతన సీఎం నాయబ్ సింగ్ సైనీ వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సైనీ అసెంబ్లీలో తన బలాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీకి 41 సీట్లు ఉన్నాయి. హర్యానా లోక్హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్, ఆరుగురు స్వతంత్రుల మద్దతు ఉంది. కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కొత్త ప్రభుత్వంవైపు నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు. ఇంతకాలం జన్నాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీని బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా సైనీతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కన్వర్ పాల్, మూల్చంద్ శర్మ, జైప్రకాశ్ దలాల్, బన్వరీలాల్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వానికి కేవలం ఏడు నెలల పదవీకాలమే ఉంది.
Also Read..
Japan Private Satellite | లాంచ్ చేసిన క్షణాల్లోనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.. VIDEO
Water Crisis | నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్ ఆర్డర్.. బెంగళూరు ప్రజల నీటి కష్టాలు
Vitamin-D | 90% మంది మహిళల్లో విటమిన్-డీ లోపం.. అపోలో, హార్లిక్స్ అధ్యయనంలో వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

