బెంగళూరు: కొవిడ్-19 ఇన్ఫెక్షన్, కొవిడ్ టీకాలకు నాడీ సంబంధ సమస్యలకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS) నిర్వహించిన క్లినికల్ స్టడీస్‌లో ఈ విషయం వెల్లడైంది. 2020 మార్చి-సెప్టెంబరు మధ్య కాలంలో న్యూరలాజికల్ అస్వస్థతలతో బాధపడుతున్న 3,200 మంది రోగుల హాస్పిటల్ రికార్డులను నిమ్హాన్స్ సమీక్షించింది.
వీరిలో 120 మంది రోగులకు కొవిడ్ ఇన్ఫెక్షన్తోపాటు న్యూరలాజికల్ అస్వస్థతలు కూడా ఉన్నట్లు తెలిసింది. కాబట్టి రోగులు కోలుకున్న తర్వాత కూడా సుదీర్ఘ కాలంపాటు వారిని పర్యవేక్షించవలసిన అవసరం ఉన్నట్లు స్పష్టమవుతున్నదని తెలిపారు.