కేరళ నుంచి కర్ణాటకలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి

బెంగళూరు: కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసుల నమోదు పది వేలు దాటింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని సీఎం యెడియురప్ప ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరి చేసింది. కేరళ నుంచి కర్ణాటకకు విమానాలు, బస్సులు, రైళ్లు, ట్యాక్సీలు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు ఈ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ 72 గంటలకు మించకూడదని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కరోనా పరీక్ష నిర్వహించి ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే విద్య, వ్యాపారం, ఇతర పనుల కోసం కర్ణాటకకు వచ్చిన వారు ప్రతి 15 రోజులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి కూడా జూన్ 29న ఇలాంటి నిబంధనలను వర్తింపజేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

