NEET UG | ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ.. ఆఫ్‌లైన్‌లో పరీక్ష: ఎన్టీఏ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో జరుగుతుందని తెలిపింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
- ఒకే రోజు, ఒకే షిష్ట్‌లో పరీక్ష
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి
- విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం
NEET UG | న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో జరుగుతుందని తెలిపింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కేంద్ర విద్య, ఆరోగ్య శాఖల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సుల కోసం కూడా నీట్ (యూజీ)ని రాయాలని పేర్కొన్నది.
నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి పరిధిలోని బీహెచ్ఎంఎస్ కోర్సు కోసం కూడా ఈ పరీక్షను రాయాలని చెప్పింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్ నిర్వహించే బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరడం కోసం కూడా నీట్ (యూజీ), 2025ని రాయాలని వివరించింది. కంప్యూటర్ బేస్డ్ విధానం కన్నా పెన్, పేపర్ మోడ్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని చాలా మంది విద్యార్థులు స్వాగతించే అవకాశం ఉంది. అభ్యర్థుల హాజరునుబట్టి చూసినపుడు మన దేశంలో అతి పెద్ద ప్రవేశ పరీక్ష నీట్. గత ఏడాది ఈ పరీక్షకు 24 లక్షల మందికిపైగా హాజరయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

