NEET-PG | ఆగస్టు రెండోవారంలో నీట్-పీజీ పరీక్ష నిర్వహణ..!
NEET-PG | పీజీ వైద్యవిద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) (National Eligibility-cum-Entrance Test-Post Graduate - NEET-PG) 2024 పరీక్ష వచ్చేనెల రెండోవారంలో జరుగనున్నది.
NEET-PG | పీజీ వైద్యవిద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) (National Eligibility-cum-Entrance Test-Post Graduate – NEET-PG) 2024 పరీక్ష వచ్చేనెల రెండోవారంలో జరుగనున్నది. సవరించిన పరీక్షా తేదీని వారంలోపు ప్రకటిస్తామని మంగళవారం అధికార వర్గాలు తెలిపాయి. ఆరోగ్యశాఖ, జాతీయ వైద్యశాస్త్ర పరీక్షల మండలి (ఎన్బీఈఎంఎస్) అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నీట్- పీజీ 2024 ఎంట్రన్స్ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నీట్-పీజీ 2024 పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై టెక్నికల్ పార్టనర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), సైబర్ సెల్ అధికారులు చర్చించారు.
నీట్-పీజీ పరీక్ష తేదీతోపాటు ఈ నెల ఆరో తేదీన జరిగే విదేశీ వైద్యవిద్యా గ్రాడ్యుయేట్ల పరీక్ష నిర్వహణకు సమర్థవంతమైన వ్యవస్థ రూపకల్పనపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమర్ధవంతంగా పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలపైనా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీసీఎస్ ప్రధాన ఎగ్జిక్యూటివ్‌ల బృందం.. పరీక్ష నిర్వహణా పద్దతిలో వివిధ అంశాలను అధికారులకు వివరించినట్లు తెలుస్తున్నది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 23న నీట్-పీజీ పరీక్ష జరుగాల్సి ఉంది. కానీ కాంపిటీటివ్ పరీక్షల సమగ్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఒక రోజు ముందు గత నెల 22న `నీట్-పీజీ 2024` పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నీట్ యూజీ 2024 పరీక్షలు అవకతవకలు జరిగాయని, ప్రశ్నాపత్రం లీకైందన్న ఆరోపణలతో విద్యార్థులు, విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ విషయమై దాఖలైన పిటిషన్లను తమకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
Electricity Bills | ఇక ఆ సిస్టమ్‌తోనే ఎలక్ట్రిసిటీ బిల్లులు పేమెంట్స్.. ఎందుకంటే..?
Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Coca-Cola | భారత్ మార్కెట్‌కు కోకా కోలా గుడ్‌బై.. ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి..?!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

