శనివారం 06 జూన్ 2020
National - May 10, 2020 , 15:34:04

నీముచ్‌‌లో పేద‌ల‌కు న్యాయ‌మూర్తుల సాయం

నీముచ్‌‌లో పేద‌ల‌కు న్యాయ‌మూర్తుల సాయం

భోపాల్‌: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టంతో పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడ‌ని పేద‌లు ఇప్పుడు చేయ‌డానికి ప‌నిలేక, రెండు పూట‌ల‌కు స‌రిప‌డా భోజ‌నం లేక అల‌మ‌టిస్తున్నారు. ఇండ్ల ముందు కూర్చుని పండ్లో, బియ్య‌మో పంచిపెట్టే దాత‌ల కోసం ఎదురు చూడ‌ట‌మే ఇప్పుడు వారి దిన‌చ‌ర్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం నీముచ్ జిల్లాలో ఇద్ద‌రు జిల్లా అద‌న‌పు న్యాయ‌మూర్తులు ఎస్కే జైన్‌, అజ‌య్ సింగ్‌ త‌మ దాతృ హృద‌యాల‌ను చాటుకున్నారు. స్థానికంగా నివ‌సిస్తున్న సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు రేష‌న్ స‌రుకులు, మాస్కులు పంచిపెట్టారు. 
logo