MLA’s Son | పరారీలో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కోడలు కోసం పోలీసుల గాలింపు..!
MLA's Son | ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు ఆండ్రో మణివాణన్, కోడలు మోర్లినా పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితమే వారిపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నీలంకారై పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.
చెన్నై: ఇంటి పనులు చేసే యువతిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు ఆంటో మథివాణన్, కోడలు మార్లినా అన్ పరారీలో ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాలుగు రోజుల క్రితమే వారిపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నీలంకారై పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. వారిని అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి.
తమిళనాడులోని పల్లావరం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కుమారుడు ఆంటో మథివాణన్, కోడలు మార్లినా అన్ తమ ఇంట్లో పని చేసే యువతిని వేధించినట్లు ఇటీవల నీలంకారై ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి వారిద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ సైదాపేట కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నట్లు సమాచారం.
ఇంటి పనులు చేస్తున్న యువతిని వారు తరచూ హింసించేవారని, వారితోపాటు ముంబైకి వెళ్లినప్పుడు వంట సరిగ్గా చేయలేదని కొట్టారని, పచ్చి మిరపకాయ తినిపించి హింసించారని, వాతలు పెట్టి రక్తం కారేలా కొట్టేవారని, మూడేళ్లు అక్కడే ఉండి పని చేయాలని బలవంతంగా సంతకం చేయించుకున్నారని, బయటకు వెళ్తే ఆమె తల్లిని ఏమైనా చేస్తామని బెదిరించారని, కులం పేరుతో తరచూ దూషించారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

