Ajit Pawar | స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా ఎన్సీపీ పోటి: అజిత్ పవార్
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్ కీలక ప్రకటన చేశారు. స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు.
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) జాతీయ అధ్యక్షుడు అజిత్ పవార్ (Ajit Pawar) కీలక ప్రకటన చేశారు. స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని తెలిపారు. పింప్రి చించ్వాడ్లో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో మహాయుతి మిత్రపక్షాలతో కలిసి ఎన్సీపీ పోరాడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిత్రపక్షాలతో కలిసి పార్టీ పోరాడుతుంది. అయితే పౌర, స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాం’ అని అన్నారు. ఎన్సీపీ గెలుపు కోసం రానున్న అసెంబ్లీ ఎన్నికలే కాకుండా స్థానిక, పౌర సంస్థల ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాగా, అజిత్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ నేతలు క్రమంగా శరద్ పవార్ వర్గం వైపు మళ్లుతున్నారు. కొన్ని రోజుల కిందట పింప్రి చించ్వాడ్కు చెందిన 28 మంది ఎన్సీపీ నేతలు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. మరి కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అదే యోచనలో ఉన్నారు. ఈ తరుణంలో స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని అజిత్ పవార్ నిర్ణయించారు.
మరోవైపు మహారాష్ట్రలో 27 మున్సిపల్ కార్పొరేషన్లు, 25 జిల్లా పరిషత్‌లు, రెండు మున్సిపాలిటీలకు సుమారు రెండేళ్లుగా ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఎన్పీపీకి పూణే, పింప్రి చించ్వాడ్లోనే బలం ఉంది. ముంబై, ఇతర నగరాల్లో ఆ పార్టీకి ఎలాంటి ఉనికి లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
High Court | లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

