న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్, ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఎన్సీఈఆర్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి ఈ ప్రకటన చేశారు. పాఠశాల విద్యలో కీలక పాత్ర పోషించే ఎన్సీఈఆర్టీ.. ఎడ్యుకేషన్ రిసెర్చ్, ఇన్నొవేషన్తోపాటు కరిక్యులమ్, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడుతుంది.