బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోల దాడి
Naxalites attacked CRPF camp in Bijapur | ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై సోమవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. పామేడు

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై సోమవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం 196వ బెటాలియన్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి ప్రయత్నించగా.. వెంటనే తేరుకున్న భద్రతా బలగాలు దాడిని తిప్పికొట్టాయి. ఇరువర్గాల మధ్య సుమారు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లు సమాచారం. బలగాల ధాటికి తట్టుకోలేక మావోయిస్టులు తప్పించుకొని పోయినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులను బీజాపూర్ ఏఎస్పీ పంకజ్ శుక్లా ధ్రువీకరించారు. కాల్పుల శబ్దం పామేడ్ గ్రామం వరకు వినిపించడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అయితే, ఇప్పటి వరకు ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఇదిలా ఉండగా.. కాల్పులు జరిగిన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతం మావోయిస్టులు నియంత్రణలో ఉంటోంది. సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఇటీవల కొత్తగా క్యాంప్ ఏర్పాటు చేశాయి. దీంతో రూ.కోట్లాది విలువైన వంతెన, రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణను కలుపుతూ.. బీజాపూర్ నుంచి పామేడ్, బసగూడ మీదుగా రోడ్డు నిర్మిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

