Jammu Kashmir Assembly polls | జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమిపై కసరత్తు : ఇరు పార్టీల మధ్య చర్చలు షురూ
Jammu Kashmir Assembly polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి.
Jammu Kashmir Assembly polls : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఈ దిశగా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఖరారు, భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని వెళ్లడం వంటి అంశాలపైనా కసరత్తు సాగుతున్నదని సమాచారం.
ఇక జమ్ము కశ్మీర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. జమ్ము కశ్మీర్ మాజీ మంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) నేత తాజ్ మొహియుద్దీన్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. తాను గత 45 ఏండ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కానీ కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్లినా ఇప్పుడు తిరిగి పార్టీలోకి వస్తున్నానని ఆయన వెల్లడించారు.
గులాం నబీ ఆజాద్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీగా తాము విజయం సాధించలేమని కుండబద్దలు కొట్టారు. ఆజాద్ సాబ్‌ను కూడా తిరిగి సొంతగూటికి (కాంగ్రెస్) తీసుకొస్తానని తెలిపారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని పార్టీ తనను ఎంతగానో గౌరవించిందని తాజ్ మొహియుద్దీన్ పేర్కొన్నారు.
కాగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
Read More :
TVK | తమిళగ వెట్రి కజగం పార్టీ జెండా ఇదే.. ఆవిష్కరించిన విజయ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

