Modi tweet : డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్‌పై దాడిని ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఖండించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఫ్రెడెరిక్సెన్‌పై దాడి వార్త తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తన స్నేహితురాలు మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
కాగా, కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద డెన్మార్క్ ప్రధానిపై ఓ దుండగుడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఫ్రెడెరిక్సెన్ షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని డెన్మార్క్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారు. ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని డెన్మార్క్ పర్యావరణ మంత్రి ఎక్స్ (ట్విటర్) లో పోస్టు చేశారు. కాగా మూడు వారాల క్రితమే యూరప్‌లోని స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు.