Nano Plastics | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్లాస్టిక్ రేణువులు (నానో ప్లాస్టిక్స్) క్రమంగా మానవుల శరీరంలోని అన్ని అవయవాల్లోకి చేరుతున్న సంగతి తెలిసిందే. కాలేయం, కిడ్నీలు సహా మెదడులోనూ అవి తిష్ట వేస్తున్నాయి. జర్నల్ నేచర్ మెడిసిన్ కథనం ప్రకారం, 2016 నాటి శవ పరీక్షలతో పోల్చితే.. మెదడులో ప్లాస్టిక్ రేణువుల పరిమాణం 50 శాతం పెరిగింది. ‘45 నుంచి 50 ఏండ్ల సగటు వయస్సు కలిగిన వ్యక్తుల్లోని మెదడు కణజాలంలో ఒక గ్రాముకు 4,800 మిల్లీగ్రాముల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయి. ఇవి నమ్మశక్యం కానంతగా ఉన్నాయి’ అని యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో సైంటిస్టు మాథ్యూ క్యాంపెన్ చెప్పారు.