లక్నో: హత్యాయత్నం కేసులో నిందితుడైన వ్యక్తిని పోలీస్ వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే మూత్ర విసర్జన కోసం అభ్యర్థించిన అతడు పోలీస్ వ్యాన్ నుంచి కిందకు దిగాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయాడు. (Murder Accused Dramatic Escape) వెంటపడిన పోలీసులు చివరకు అతడ్ని పట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పాత కక్షల కారణంగా ఒక వృద్ధుడ్ని హత్య చేసేందుకు కేశవ్ శర్మ అనే యువకుడు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీస్ వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా, పోలీస్ వ్యాన్లో ఉన్న నిందితుడు కేశవ్ శర్మ మూత్ర విసర్జనకు వెళ్లాలని పోలీసులను అభ్యర్థించాడు. ఒక పోలీస్ డోర్ తెరిచి కిందకు దిగాడు. పోలీస్ వ్యాన్ నుంచి దిగిన కేశవ్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. అక్కడి నుంచి మెయిన్ రోడ్డు వైపు పరుగుతీశాడు. వెంటనే తేరుకున్న పోలీసులు అతడి వెంట పరుగెత్తారు. నిందితుడు కేశవ్ శర్మను వెంబడించి అతడ్ని తిరిగి అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
हिमाचल प्रदेश के सदर थाना हमीरपुर से हत्या के प्रयास के आरोपी ने भागने का किया प्रयास।
सीसीटीवी कैमरे में हुआ दृश्य कैद।#hamirpur #himachalpradesh #SaveHimachal pic.twitter.com/7P8ZRNSjpu— Ajay Sharma (@Himachali_Hindu) April 4, 2025