Watch: పోలీస్ నుంచి గన్ లాక్కొని కాల్చుకునేందుకు నిందితుడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Accused Snatches Cop's Gun | నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ నుంచి గన్ను అతడు లాక్కున్నాడు. (Accused Snatches Cop's Gun) తొలుత ఆ పోలీస్‌ను బెదిరించాడు. ఆ తర్వాత గన్ను తన తలకు ఎక్కుపెట్టుకున్నాడు. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ నుంచి గన్ను అతడు లాక్కున్నాడు. (Accused Snatches Cop’s Gun) తొలుత ఆ పోలీస్‌ను బెదిరించాడు. ఆ తర్వాత గన్ను తన తలకు ఎక్కుపెట్టుకున్నాడు. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. హత్య చేసేందుకు తనపై దాడి చేశారంటూ మనీష్ ప్రజాపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రషీద్, డానిష్, ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే డానిష్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, శనివారం మధ్యాహ్నం రషీద్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఒక పోలీస్ వద్ద ఉన్న గన్ను అతడు లాక్కున్నాడు. తొలుత పోలీస్‌ను బెదిరించాడు. తర్వాత తన సహచరుడ్ని విడిపించాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత గన్ను తన తలకు గురిపెట్టుకున్నాడు. కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా అక్కడ గుమిగూడారు. దీంతో ఏం జరుగుతోందో అన్న ఉత్కంఠ నెలకొన్నది. తొలుత పోలీసులు రషీద్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు అతడి నుంచి గన్ తీసుకున్నారు. రషీద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : मेरठ में धमकी देने के आरोपी राशिद को पकड़ने पुलिस गई थी। पुलिस के सामने राशिद ने अपनी कनपटी पर तमंचा लगा लिया। आत्महत्या की धमकी दी। पुलिस ने साहस दिखाकर आरोपी को दबोचा, 2 तमंचे बरामद हुए। pic.twitter.com/ToUnzxgmUv
— Sachin Gupta (@Sachingupta) January 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

