సోమవారం 26 అక్టోబర్ 2020
National - Apr 06, 2020 , 02:22:41

తండ్రిని చూసేందుకు.. సైకిల్‌పై ముంబై టు కశ్మీర్‌

తండ్రిని చూసేందుకు.. సైకిల్‌పై ముంబై టు కశ్మీర్‌

ముంబై/రాజౌరీ:  దవాఖానలో ఉన్న కన్నతండ్రిని చూసేందుకు ఓ కొడుకు కనీవినీ ఎరుగని సాహసం చేశాడు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లకు చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ (36) ముంబైలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో ఉన్న తండ్రికి గుండెపోటు వచ్చిందని ఈనెల 1న సమాచారం అందడంతో  కశ్మీర్‌కు వెళ్లాలనుకున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా స్తంభించడంతో తోటి ఉద్యోగి పాత సైకిల్‌ను రూ.500కు కొనుగోలు చేసి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న సీఆర్పీఎఫ్‌.. అతడి తండ్రిని రాజౌరీ జిల్లా దవాఖానకు తరలించి చికిత్స అందించింది. ఈ సంగతిని  ఆరిఫ్‌కు చెప్పిన అధికారులు కశ్మీర్‌కు రావద్దని సూచించారు. అయితే, ఆరిఫ్‌ తన తండ్రిని చూడకుండా ఉండలేకపోయాడు. అష్టకష్టాలు పడుతూ ఆదివారం గుజరాత్‌ వరకు చేరుకున్నాడు. స్థానిక పోలీసులు మొదట అడ్డగించినా.. విషయం తెలుసుకున్న తర్వాత చలించిపోయారు. కశ్మీర్‌ వెళ్తున్న ఓ ట్రక్కులో ఆరిఫ్‌ను పంపారు. logo