ముంబై: భారత నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. ప్రాజెక్టు-15బి కింద దేశీయంగా తయారు చేసిన విశాఖపట్నం తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక INS మర్ముగోవా రేపు ముంబైలోని నావల్ డాక్యార్డ్ నుంచి జలప్రవేశం చేయనుంది.
ప్రాజెక్టు-15బి కింద దేశీయంగా నాలుగు విశాఖపట్నం తరగతి యుద్ధనౌకలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక యుద్ధనౌక నిర్మాణం పూర్తి చేసుకుని విధుల్లో చేరింది. రేపు విశాఖపట్నం తరగతికి చెందిన రెండో యుద్ధనౌక కూడా జలప్రవేశం చేయబోతుంది. మరో రెండు విశాఖపట్నం తరగతి యుద్ధనౌకలు నిర్మాణంలో ఉన్నాయి.