e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News క‌రోనా ఎఫెక్ట్‌.. హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్‌

క‌రోనా ఎఫెక్ట్‌.. హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్‌

క‌రోనా ఎఫెక్ట్‌.. హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్‌

ముంబై : బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నివాసం ఉంటున్న బిల్డింగ్‌ను ముంబై మున్సిప‌ల్ అధికారులు సీజ్ చేశారు. ఆ బిల్డింగ్‌లో 15 కోవిడ్ కేసులు న‌మోదు కావ‌డంతో దాన్ని ప్ర‌స్తుతానికి లాక్‌ చేశారు. ద‌క్షిణ ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్డులో ఉన్న పృథ్వీ అపార్ట్‌మెంట్‌లో సునీల్ శెట్టి త‌న ఫ్యామిలీతో క‌లిసి ఉంటున్నాడు. ఆ బిల్డింగ్‌లోని 18వ అంత‌స్తులో వాళ్లు నివాసం ఉంటున్నారు. శ‌నివారం రోజున పృథ్వీ అపార్ట్‌మెంట్స్‌ను సీల్ చేసిన‌ట్లు బీఎంసీ అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ప్ర‌శాంత్ గైక్వాడ్ తెలిపారు. బిల్డింగ్ నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు అక్క‌డ పోలీసుల్ని మోహ‌రించారు. సునీల్ శెట్టి కుటుంబం అంతా క్షేమంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఆ బిల్డింగ్‌లో ఉంటున్న‌వారికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేశారు. బీఎంసీ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ఏదైనా బిల్డింగ్‌లో 5 కోవిడ్ కేసులు న‌మోదు అవుతే, ఆ బిల్డింగ్ కంటోన్మెంట్ ఏరియాగా ప‌రిగ‌ణించ‌నున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా ఎఫెక్ట్‌.. హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్‌
క‌రోనా ఎఫెక్ట్‌.. హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్‌
క‌రోనా ఎఫెక్ట్‌.. హీరో సునీల్ శెట్టి బిల్డింగ్ సీజ్‌

ట్రెండింగ్‌

Advertisement