న్యూఢిల్లీ: ఎన్ఐఏ కస్టడీలోని ముంబై 26/11 దాడి కేసు నిందితుడు తహవ్వుర్ రాణాను శనివారం రెండో రోజూ అధికారులు విచారించారు. తమ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే తాము సేకరించిన పలు విషయాలపై ఆయనను ఎన్ఐఏ ప్రశ్నించింది.
పాక్లో పుట్టి పెరిగిన రాణాకు, ఈ కేసులో సహ కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ మధ్య పెద్దయెత్తున జరిగిన ఫోన్ సంభాషణల గురించి, ముంబై పేలుళ్లకు ముందు భారత్లో రాణా జరిపిన పర్యటనలకు సంబంధించిన కీలక సమాచారం విచారణలో లభ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.