Anant Ambani – Radhika Merchant Engagement | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ( Mukesh Ambani ) కుమారుడు అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని అంబానీల నివాసంలో గుజరాతీ హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
విరెన్ మర్చంట్ ( Viren Merchant ) ఇంటికి అనంత్ అంబానీ సోదరి ఈషా అంబానీ ( Isha Ambani ) వెళ్లి రాధికా మర్చంట్‌ను ఆహ్వానించడంతో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలు మొదలయ్యాయి. ఈషా అంబానీ ఆహ్వానం మేరకు తమ నివాసానికి చేరుకున్న మర్చంట్ ఫ్యామిలీకి అంబానీ కుటుంబం ఘన స్వాగతం పలికింది. అనంత్, రాధికను శ్రీ కృష్ణ మందిరం తీసుకెళ్లి ఆశీర్వచనాలు అందించారు. అక్కడి నుంచి నిశ్చితార్థ వేదికపైకి వెళ్లి గణపతి పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం లగ్న పత్రికను చదివి వినిపించారు.
అనంతరం గుజరాతీ హిందూ సంప్రదాయాలైన గోల్ ధన ( Gol Dhana ), చునారి విధి ( Chunari Vidhi )కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇరు కుటుంబాలు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఉత్సాహంగా గడిపాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ ( Nita Ambani ) నేతృత్వంలో అంబానీ ఫ్యామిలీ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ వేడుకల తర్వాత అనంత్, రాధికా ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. తొందరలోనే వీరి వివాహం జరగనుంది.