ముంబై, అక్టోబర్ 28: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకుంటే కాల్చి చంపేస్తామని దుండగులు ఆయనకు ఈ మెయిల్ సందేశం పంపారని ముంబై పోలీసులు శనివారం వెల్లడించారు. ముకేశ్ అంబానీ భద్రతా అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మెయిల్ పంపిన దుండగుడిని గుర్తించేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు.