బెంగళూరు : ‘ముడా’ కేసులో సీఎం సిద్ధరామయ్య దంపతులు సహా మరికొంతమందికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈనెల 28లోగా తమ స్పందన తెలియజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నది. ముడా కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను గతంలో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తిరస్కరించింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ ఆయన తిరిగి పిటిషన్ వేశారు. బుధవారం ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపిన నోటీసులు ఇచ్చింది.