Kangana Ranaut | నన్ను క్షమించండి.. రైతులను కోరిన కంగనా రనౌత్
తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద రైతు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు చాలామందిని అసంతృప్తి, బాధకు గురి చేశాయని, దీనికి తనను క్షమించాలని ఆమె కోరారు.
- రైతు చట్టాలపై వ్యాఖ్యలు వెనక్కి
Kangana Ranaut | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద రైతు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు చాలామందిని అసంతృప్తి, బాధకు గురి చేశాయని, దీనికి తనను క్షమించాలని ఆమె కోరారు. ‘కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు వేసింది. గతంలో రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలని నేను ప్రధాని మోదీని కోరుతానని చెప్పా.
అయితే నేను చేసిన ఈ ప్రకటన చాలామందిని బాధించింది. నేను నా ప్రకటనను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబతున్నా. నేనొక బీజేపీ కార్యకర్తను. నేను చేసే ప్రకటనలు పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి తప్ప, వ్యక్తిగతంగా ఉండకూడదు’ అని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా, కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, వాటికి పార్టీతో సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

