భోపాల్: ఎక్స్‌ప్రెస్‌వే పక్కన ఆగిన కారు నుంచి బీజేపీ నేత దిగాడు. నగ్నంగా ఉన్న మహిళ కూడా ఆ కారు నుంచి కిందకు దిగింది. ఆ తర్వాత బహిరంగంగా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న సీసీటీవీలో వారి లైంగిక చర్య రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఆ బీజేపీ నేతపై కేసు నమోదైంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మే13న రాత్రి వేళ ఢిల్లీ-ముంబై 8 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే పక్కన తెల్లటి కారు ఆగి ఉన్నది. మందసౌర్‌కు చెందిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్ (Manohar Lal Dhakad) ఆ కారు వెనుక సీటు నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత నగ్నంగా ఉన్న మహిళ కూడా ఆ కారు నుంచి కిందకు దిగింది. మనోహర్ లాల్ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బహిరంగంగా ఆ మహిళతో లైంగిక చర్యలో పాల్గొన్నాడు.
కాగా, ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు స్పందించారు. బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్పై కేసు నమోదు చేశారు.
మరోవైపు ధకాడ్ మహాసభ యువజన సంఘం ఈ సంఘటనపై స్పందించింది. మనోహర్ లాల్ ధకాడ్ను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. బీజేపీ కూడా ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నది. ధకాడ్ పార్టీలో ప్రాథమిక సభ్యుడు కాదని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా చేరాడని పేర్కొంది. కాగా, ధకాడ్ భార్య మందసౌర్‌లోని బని గ్రామంలో వార్డ్ నంబర్‌గా ఎన్నికైన జిల్లా పంచాయతీ సభ్యురాలు.