Movie Songs | పెళ్లిళ్లలో సినిమా పాటలు ప్లే చేయడం కాపీరైట్ కిందకు రాదు.. కేంద్రం క్లారిటీ
Movie Songs | వివాహాది కార్యక్రమాలు (Weddings), ఇతర శుభకార్యాల్లో సినిమా పాటలను (Movie Songs) ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన (Copyright Violation) కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం (Central Govt) స్పష్టం చేసింది.
Movie Songs | వివాహాది కార్యక్రమాలు (Weddings), ఇతర శుభకార్యాల్లో సినిమా పాటలను (Movie Songs) ప్లే చేయడం కాపీరైట్ ఉల్లంఘన (Copyright Violation) కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం (Central Govt) స్పష్టం చేసింది. వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శన కోసం కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయడంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వాటికి ఏ ఒక్కరూ రాయల్టీ వసూలు చేయకూడదని ఆదేశించింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కీలక ప్రకటన వెలువరించింది.
వివాహాది శుభకార్యాలతో పాటు ఇతర ఉత్సవాల సమయంలో సినిమా పాటలు వాడకం, ప్రదర్శనకు ఆయా భాగస్వామ్య పక్షాలు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇది కాపీరైట్ చట్టం 1957 లోని సెక్షన్ 52(1)కు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే సాహిత్య, నాటక, మ్యూజిక్ లేదా ఏదైనా సౌండ్ రికార్డింగ్ లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) లో ఉందని తెలిపింది. వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర సంప్రదాయ కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని.. వీటిని దృష్టిలో పెట్టుకొని కాపీరైట్ సంస్థలు వ్యవహరించాలని డీపీఐఐటీ (DPIIT)తన ప్రకటనలో వెల్లడించింది.
Also Read..
Samantha | నాలుగు డిగ్రీల చలిలో.. సమంత ఐస్ బాత్
Cargo Ship | మంటల్లో 3000 కార్లు.. నడిసముద్రంలో ఫైర్ యాక్సిడెంట్
Heavy Rain | ముంబైకి రెడ్ అలర్ట్ .. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న బీఎంసీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

