ఎవరెవరికి ఏ శాఖ.. ఇవీ డిటైల్స్..!!
ఎవరెవరికి ఏ శాఖ.. ఇవీ డిటైల్స్..!! | క్యాబినెట్లో ప్రధాని నరేంద్రమోదీ సమూల మార్పులు చేశారు. బుధవారం 36 మంది కొత్త మంత్రులను తీసుకోవడంతోపాటు ,,,

న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్లో ప్రధాని నరేంద్రమోదీ సమూల మార్పులు చేశారు. బుధవారం 36 మంది కొత్త మంత్రులను తీసుకోవడంతోపాటు ఏడుగురు సహాయ మంత్రులకు క్యాబినెట్ హోదా కల్పించారు. ఇక 12 మంది సీనియర్ మంత్రులను తప్పించారు. 2019 మేలో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మంత్రివర్గ విస్తరణ ఇది.
రైల్వే శాఖకు మాజీ ఐఏఎస్
రాష్ట్రపతి భవన్లో 15 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి అశ్విని వైష్ణవ్ నూతన రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. మాన్సుఖ్ మాండవియా కొత్త ఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులయ్యారు.
సింధియాకు సివిల్ ఏవియేషన్
జ్యోతిరాదిత్య సింధియాకు పౌర విమానయానం అప్పగించారు. ఇంతకుముందు ఆయన తండ్రి మాధవ్ రావు సింధియా కూడా ఇదే శాఖను నిర్వహించడం గమనార్హం. ఇక కిరణ్ రిజిజు నూతన న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
శాఖల వారీగా మంత్రుల వివరాలివి
ప్రధాని నరేంద్రమోదీ- సిబ్బంది వ్యవహారాలు, పబ్లిక్ గ్రీవియెన్స్ అండ్ పెన్షన్స్, అణు ఇంధనం, అంతరిక్షం, మంత్రులకు కేటాయించని శాఖలు
క్యాబినెట్ మంత్రులు
- రాజ్‌నాధ్ సింగ్ -రక్షణశాఖ
- అమిత్ షా-హోంతోపాటు సహకార శాఖ
- నితిన్ గడ్కరీ – జాతీయ రహదారులు
- నిర్మలా సీతారామన్- ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
- నరేంద్ర సింగ్ తోమర్ -వ్యవసాయం, రైతుల సంక్షేమం
- ఎస్ జైశంకర్ -విదేశాంగం
- అర్జున్ ముండా- గిరిజన సంక్షేమం
- స్మ్రుతి ఇరానీ – మహిళా శిశు సంక్షేమం
- పీయూష్ గోయల్- వాణిజ్య శాఖతోపాటు వివినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ, చేనేత మరియు జౌళి
- ధర్మేంద్ర ప్రధాన్ -విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్
- ప్రహ్లాద్ జోషి- పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖలు
- నారాయణ్ రాణె -సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
- శర్బానంద సోనోవాల్ -నౌకాయానం, జల మార్గాలు, ఆయుష్ మంత్రిత్వశాఖ
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ- మైనారిటీ వ్యవహారాలు
- డాక్టర్ వీరేంద్ర కుమార్- సామాజిక సాధికారత
- గిరిరాజ్ సింగ్- రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్
- జ్యోతిరాదిత్య సింధియా – పౌర విమానయానం
- ఆర్సీపీ సింగ్ – ఉక్కుశాఖ
- అశ్విని వైష్ణవ్ – రైల్వే, ఐటీ, టెలీ కమ్యూనికేషన్ల శాఖ
- పశుపతి కుమార్ పరాస్ – ఫుడ్ ప్రాసెసింగ్
- గజేంద్ర సింగ్ షెకావత్ -జల శక్తి
- కిరెన్ రిజిజు- న్యాయ శాఖ
- ఆర్కే సింగ్- విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరులశాఖలు
- హర్దీప్ సింగ్ పూరి-పెట్రోలియం, హౌసింగ్, అర్బన్ అఫైర్స్
- మాన్సుఖ్ మాండవియా – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఫర్టిలైజర్స్ శాఖలు
- భూపేంద్ర యాదవ్- పర్యావరణం, అటవీ శాఖ, కార్మిక శాఖ
- డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే-భారీ పరిశ్రమలు
- పురుషోత్తం రూపాలా- పాడి, మత్స్యశాఖలు
- జీ కిషన్ రెడ్డి- సాంస్క్రుతిక, పర్యాటక శాఖలు, ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధి
- అనురాగ్ సింగ్ ఠాకూర్- సమాచార, ప్రసారాలు, యువజన క్రీడా సర్వీసులు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

