‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
కోల్ మైన్స్ పెన్షన్, సింగరేణి సీపీఆర్ఎంఎస్ (CPRMS) మెడికల్ కార్డు అర్హత కలిగిన మాజీ సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తమ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్)ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్...
– కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్.వెంకట రమణ
– ఈ 5, 6 తేదీల్లో రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో అవగాహన సదస్సు
రుద్రంపూర్, నవంబర్ 03 : కోల్ మైన్స్ పెన్షన్, సింగరేణి సీపీఆర్ఎంఎస్ (CPRMS) మెడికల్ కార్డు అర్హత కలిగిన మాజీ సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తమ లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్)ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్.వెంకట రమణ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ విధానంలో సులభంగా నమోదు చేసుకునే ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం, రీజినల్ కమిషనర్, సీఎంపీఎఫ్ కొత్తగూడెం రీజియన్ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెండు రోజుల పాటు అవగాహన సదస్సు
ఈ నెల 5, 6 తేదీల్లో రుద్రంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదస్సు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా పెన్షన్‌తో పాటు సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను నమోదు చేసుకునే విధానాన్ని వివరించనున్నారు. మాజీ సింగరేణి ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీఎం కోరారు. అర్హులైన వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి సదస్సుకు హాజరై జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను నమోదు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
CBFC | సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ పిరికిపంద చర్య.. బాలీవుడ్ దర్శకుడు తీవ్ర ఆగ్రహం!
‘విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

