బెంగాల్లో మమత ఎంతో మోదీ కూడా అంతే పాపులర్

ప్రశాంత్ కిశోర్ అన్నట్టు బీజేపీ ఆడియో లీక్
కోల్‌కతా, ఏప్రిల్ 10: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సభలు, ర్యాలీలతో పాటు ఆడియో లీకులు కూడా ప్రచారంలో భాగంగా మారాయి. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ పోటాపోటీగా ఆడియో లీకులు చేస్తున్నాయి. శనివారం కూడా బీజేపీ ఓ ఆడియోను లీక్ చేసి ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేసింది. ‘బెంగాల్లో మమత ఎంత పాపులరో.. ప్రధాని మోదీ కూడాఅంతే పాపులర్. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది’ అంటూ తృణమూల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెబుతున్నట్లుగా ఉన్న ఆడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విట్టర్లో బయటపెట్టారు. ఈ ఎన్నికల ద్వారా నిరుపయోగమైన తృణమూల్‌ను ఇక వదిలించుకోండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే తాను మాట్లాడిన మాటల్లోని అక్కడక్కడి పదాలను కలిపి ఆడియోను రూపొందించారని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. మొత్తం ఆడియోను విడుదల చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. బెంగాల్లో బీజేపీ 100 సీట్ల కన్నా ఎక్కువ గెలువలేదని పునరుద్ఘాటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

