ఏక్నాథ్ షిండే కేబినెట్లోకి ఎంఎన్ఎస్..? రాజ్‌ఠాక్రేతో ఫడ్నవీస్ భేటీ
ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేను కలిశారు. దాదర్‌లోని రాజ్‌ఠాక్రే నివాసంలో ఇద్దరు గంటన్నరపాటు సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు ముందు ఇద్దరి భేటి చర్చనీయాంశమైంది. ఎంఎన్ఎస్ ఏక్నాథ్ షిండే మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం.
ఈ క్రమంలో రాజ్‌ఠాక్రేతో ఈ విషయంపై చర్చించేందుకు ఫడ్నవీస్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఇంతకుముందు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమయంలో రాజ్‌ఠాక్రే, ఏక్నాథ్ షిండే సంభాషణకు సంబంధించి వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే, ఠాక్రే ఆరోగ్యంపైనే షిండే ఫోన్ చేసినట్లు తెలిసింది. మరో వైపు హిందుత్వంపై ఉద్ధవ్ ఠాక్రేపై రాజ్‌ఠాక్రే నిరంతరం విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అలాగే ఏక్నాథ్ షిండే సైతం హిందుత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

