న్యూఢిల్లీ: సిరియాలోని ప్రధాన నగరాలను తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకుంటున్న నేపథ్యంలో భారత పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది.
‘సిరియాలో పరిస్థితుల నేపథ్యంలో తదుపరి ప్రకటన జారీ చేసే వరకు భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రస్తుతం అక్కడ ఉన్న వారు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వీలైనంత త్వరగా సిరియాను వదిలిరండి’ అని శుక్రవారం రాత్రి విదేశాంగ శాఖ ఒక అడ్వైజరీ జారీ చేసింది.